Telugu Chitapatalu

About Myself

నా గురించి : నేను గోదావరి తీరాన పుట్టి పెరిగిన ఒక యువకుడిని .నాతో ఉండేవాళ్ళు నా వల్ల ఆనందంగా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటాది . అందులో భాగంగా వ్రాసినవే మీరు చదివే ఈ కవితలు . నేను వ్రాసిన ప్రేమ కవితలలో చాలా మటుకు నువ్వు అని వ్రాస్తుంటాను .నువ్వు అని కొంత మందిని ఉద్దేసించి వ్రాస్తాను..ఉదాహరణకు నా తల్లి తండ్రులు,స్నేహితులు, మంచి మనసున్న వాళ్ళు దూరంగా ఉంటే నేను ఎలాగ బాధపడతానో అనేది నా కవితలలో ఉంటాయి తప్ప ఒక అమ్మాయి ప్రేమలో మునిగి తేలిన తరువాత వ్రాసినవి ఏమి ఉండవు . నాకు అమెరికాకు వెళ్లి లక్షలు సంపాదించడం ఇష్టం లేదు ఏదో మల్లీశ్వరి సినిమా లో వెంకటేష్ లా ఆంధ్ర బ్యాంకు లో క్లెర్క్ పోస్ట్ వస్తే చాలనుకుంటాను .

ప్రేమ గురించి నా అభిప్రాయం :
 
తడబడుతూ వేసే నడకల నుంచి ఏడడుగులు వేస్తూ నడిచే నడకల మధ్య లో ఒక అమ్మాయినో లేదా ఒక అబ్బాయినో చూసి నేను ప్రేమిస్తునాను అని అనుకునేది ప్రేమకాదు .
అన్ని ఏళ్ళు కని పెంచిన తల్లి తండ్రులను వాళ్ళ ప్రేమకోసం వదిలేస్తాం అంటారు . కాని అదే పని చిన్న తనం లో వాళ్ళ తల్లి తండ్రులు వీళ్ళు మనల్ని పెద్దయాక చూస్తారో లేదో అని వాళ్ళని వదిలేసుంటే వాళ్ళు ఇప్పుడు ఏమై ఉండేవారు ? 


ముక్య  గమనిక : బాధ లో ఉన్నప్పుడు ఎవరికైన చెప్పు కొంటె బాధ తగ్గుతుంది . ఆనందంగా ఉన్నప్పుడు ఎవరితోనయినా పంచు కొంటె ఆనందం ఇంకా పెరుగుతుంది .కాని ఏదో ఒకటి చేబుతేనే కదా,మీరు ఏమి ఫీల్ అవుతున్నారో నాకు తెలిసేది . నాకు చెప్పాలి అనుకుంటే teluguchitapatalu@gmail.com  ఈ మెయిల్ ఐడి కి మీ అమూల్యమైన ఫీలింగ్స్ నీ పంపండి.